ముఖ్యమంత్రి పర్యటన పనులు పర్యవేక్షించినమంత్రి బీసీ జనార్దన్

2468చూసినవారు
What: నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బనగానపల్లెలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం  పర్యవేక్షించాను. ముందుగా హెలిపాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించాను. ముందస్తు ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళిక, భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశాను. భారీగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సీఎం గారి పర్యటనను విజయవంతం చేయాలని సూచించాను.

సంబంధిత పోస్ట్