ఆదివారం, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి అవిటితనం లేని సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.