బనగానపల్లెలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

2687చూసినవారు
బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. రీ సర్వే, ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు జూలైలో అప్పలాపురం, కాపులపల్లె గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. PGRSకు గైర్హాజరయ్యే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్