బనగానపల్లె మండలం లోని ప్రముఖ శైవ క్షేత్రాలైన యాగంటి ఉమామహేశ్వరస్వామి, నందవరం చౌడేశ్వరి క్షేత్రాల్లో చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ డి.పాండురంగారెడ్డి, ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు తెల్లవారుజామున కుంకుమార్చన, రుద్రాభిషేకం, అభిషేకాలు, మహామంగళహారతి వంటి పూజలు చేశారు. పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.