బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని సచివాలయంలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జెఎస్ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో 'నేటి పొదుపే రేపటి భవిష్యత్తు బాట' కరపత్రం విడుదల చేసి, పొదుపుపై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, పొదుపు చేయడం వల్ల ఆర్థిక, ఆరోగ్య అవసరాలు తీరడమే కాకుండా, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే గ్యాస్, విద్యుత్, పెట్రోల్, నీరు వంటి ఇంధన వనరులను పొదుపు చేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం ఎం ఉస్మాన్ హజరత్, మహేశ్వరి, పొదుపు లక్ష్మి మహిళలు పాల్గొన్నారు.