బనగానపల్లెలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటిలో, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని బుధవారం దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు, ఆలయ ఈఓ డి. పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌళీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఉదయం స్వయంభువుగా వెలసిన శివునికి జలభిషేకం, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలతో పూజలు ఘనంగా జరిగాయి.