డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే, వందేమాతరం గీతం రచయిత బంకించంద్ర ఛటర్జి, 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' రచయిత శంకరంబాడి సుందరాచారిల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఫి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరయోధులను, మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. మంగళ్ పాండే 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించి, ఏప్రిల్ 8, 1857న ఉరితీయబడ్డారు. బంకించంద్ర ఛటర్జి రచించిన వందేమాతరం గీతం స్వాతంత్ర్య సంగ్రామంలో స్ఫూర్తిని నింపింది. ఆయన ఏప్రిల్ 8, 1894న స్వర్గస్తులయ్యారు.