డోన్: అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

56చూసినవారు
డోన్: అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం బనగానపల్లె పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణ, సారా నిర్మూలన, ప్రజల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నాలుగేళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఫాక్సో కింద కేసు నమోదైనట్టు, ఒకరిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు చెప్పారు. సీఐ ప్రవీణ్ కుమార్ కృషిని అభినందించారు.

సంబంధిత పోస్ట్