డోన్‌: చాక్‌పిస్‌లతో అద్భుత ఆలయ నమూనా

620చూసినవారు
డోన్‌: చాక్‌పిస్‌లతో అద్భుత ఆలయ నమూనా
డోన్‌ పట్టణానికి చెందిన మధుసుదన్ గౌడ్, సుమ, లక్ష్మీలు సుమారు 2000 చాక్‌పిస్‌లను ఉపయోగించి వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను రూపొందించారు. 25 రోజుల పాటు నిరంతరం శ్రమించి గోపురం నుంచి మండపం వరకు ప్రతి భాగాన్ని అచ్చం నిజమైన ఆలయంలా తీర్చిదిద్దారు. సన్నని శిల్పకళను ప్రతిబింబించేలా ఉన్న ఈ అద్భుత కళాఖండాన్ని చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరి ప్రతిభను పలువురు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్