ఆళ్లగడ్డ టౌన్ సీఐ యుగంధర్ ఐపీఎల్ నేపథ్యంలో యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై నిఘా ఉంచామని, పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని ఆయన కోరారు.