వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతుని నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.