జూన్ 12న స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జయంతి సందర్భంగా, డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.