స్వాతంత్ర్య సమరయోధులు,బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

3526చూసినవారు
స్వాతంత్ర్య సమరయోధులు,బాబు జగ్జీవన్ రామ్  సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలోని టి.ఆర్. నగర్ ఎం.పి.పి. స్కూల్లో సోమవారం స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త శ్రీ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, స్కూల్ హెచ్.ఎం. కేవీ. సతీష్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులకు వాతావరణ కాలుష్యం, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్