లాలా లజపతిరాయ్ జయంతి: విద్యార్థులకు కాలుష్యం, ఆరోగ్యంపై అవగాహన

55చూసినవారు
లాలా లజపతిరాయ్ జయంతి: విద్యార్థులకు కాలుష్యం, ఆరోగ్యంపై అవగాహన
జనవరి 28న, డోన్ పట్టణంలోని టి.ఆర్. నగర్ ఎం.పి.పి. స్కూల్లో శ్రీ పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ జయంతి సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వాతావరణ కాలుష్యం, ఆరోగ్యం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. లాలా లజపతిరాయ్ జీవితం, దేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, జంక్ ఫుడ్ మానేయడం, తగినంత నిద్ర పోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకపోవడం వంటి ఆరోగ్య సూచనలు కూడా విద్యార్థులకు అందించారు.

సంబంధిత పోస్ట్