వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి

163చూసినవారు
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
01-04-2026న నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఊటకొండ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి ఆధ్యాత్మికత, సమానత్వం, మానవ విలువలను సమాజానికి పరిచయం చేసిన మహనీయులని ఎమ్మెల్యే కొనియాడారు. గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్