జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ పై అవగాహన ర్యాలీ

1199చూసినవారు
జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ పై అవగాహన ర్యాలీ
డోన్ పట్టణంలో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 'జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్' పై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు, కార్యాలయాలు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి, మున్సిపల్ ఆఫీసు నుండి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డిఓ కె.పి. నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ, వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అపరిశుభ్రత వల్ల వాయు కాలుష్యంతో పాటు ఆరోగ్య సమస్యలు వస్తాయని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మొక్కలు నాటడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించారు. నీటిని వృధా చేయకుండా జల సంక్షోభాన్ని అరికట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక బృందాల ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్