స్వాతంత్య్ర సమరయోధుల, మహనీయుల, శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం

3935చూసినవారు
స్వాతంత్య్ర సమరయోధుల, మహనీయుల, శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద, శాస్త్రవేత్త మేరీ క్యూరీల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఫి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని, విద్యార్థులు మంచి ప్రయోగాలు చేసి సమాజ సేవలో భాగస్వాములై దేశానికి సేవ చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, పింగళి వెంకయ్య, మేరీ క్యూరీల జీవిత విశేషాలను, వారి సేవలను గుర్తుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్