రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న హార్వేకు నివాళి

576చూసినవారు
రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న హార్వేకు నివాళి
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఏప్రిల్ 01న రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త విలియం హార్వే గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రఫి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. విలియం హార్వే 1578 ఏప్రిల్ 1న జన్మించి, గుండె పనితీరును, రక్త ప్రసరణ వ్యవస్థను వివరించి వైద్యశాస్త్రంలో మార్గదర్శకుడయ్యాడు. ఆయన ప్రయోగాల ఫలితాలు నేటికీ రోగ నిర్ధారణకు ఉపయోగపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్