జి. శింగవరం: తుంగభద్ర తీరంలో తలలేని మృతదేహం కలకలం

4414చూసినవారు
జి. శింగవరం: తుంగభద్ర తీరంలో తలలేని మృతదేహం కలకలం
కర్నూలు మండలం జి. శింగవరం గ్రామ శివారులోని తుంగభద్ర నది తీరంలో తలలేని మానవ అస్థిపంజరం లభించడం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం గ్రామ వీఆర్ రాఘవేంద్ర సమాచారంతో తాలుకా సీఐ తేజోమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని మృతదేహంగా బీఎన్‌ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతుడి వివరాలపై సమాచారం ఉన్నవారు 9121101063 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్