కర్నూలు జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం కర్నూలులో క్రీడాకారులను అభినందించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఫెడరేషన్ నేషనల్ ఛాంపియషిప్ 2024-25లో మూడు బంగారు, రెండు కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. తైక్వాండో క్రీడను విద్యార్థి దశ నుంచి కొనసాగించి భవిష్యత్తులో పెద్ద విజయాలు సాధించాలన్నారు.