కర్నూలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన అభివృద్ధి లేదన్నారు. అక్రమ కేసులు పెంచుతున్నట్లు, మహిళలు, దళితులపైన కేసులు నమోదు చేయడం, సంక్షేమ పథకాలు ఇచ్చామని మభ్యపెడుతున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల విషయంలో కూడా కక్ష్య చర్యలకు ప్రయత్నిస్తున్నారన్నారు.