తుగ్గలిలో తొలకరి జల్లులతో వజ్రాల వేట సందడి

1343చూసినవారు
తుగ్గలిలో తొలకరి జల్లులతో వజ్రాల వేట సందడి
తొలకరి వర్షాలు కురవడంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, జి. ఎర్రగుడి ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ మళ్లీ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది వజ్రాన్వేషకులు పొలాల్లో వంటావార్పు చేసుకుంటూ వజ్రాల కోసం వెతుకుతున్నారు. అయితే, అన్వేషకులకు వజ్రాలు దొరికినట్లు స్పష్టమైన సమాచారం లేదు. వజ్రాల వేటతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్