కర్నూలులో 18 మంది బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు

1670చూసినవారు
కర్నూలులో 18 మంది బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు
కర్నూలు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 18 మంది బీఎల్‌వోలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి చల్లా ఓబులేసు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో వెనుకబడటం, ఫారాలను సకాలంలో అందించడంలో అలసత్వం వహించినట్లు గుర్తించారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతనంగా నియమితులైన 17 మంది అదనపు ఏఈఆర్‌వోలకు అవగాహన కల్పించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్