కర్నూలు జిల్లాలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. చెరువంక రోడ్డుపై నీరు ప్రవాహించడంతో హాలహర్వి-గూళ్యం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గూళ్యం నుంచి రావాల్సిన ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఎన్టీఆర్ నగర్ ఎస్సీ కాలనీలోకి వర్షపు నీరు చేరింది. ఎమ్మిగనూరు(M) కడివెళ్లలో కప్పల వంక ఉప్పొంగి ప్రవహించడంతో ఎమ్మిగనూరు-పత్తికొండ మధ్య రాకపోకలు కూడా స్తంభించాయి.