మంత్రాలయం పరిధిలోని పెద్దకడబూరు మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిప్యూటీ తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి బుధవారం వినతిపత్రం అందజేశారు. రేకుల షెడ్లలో తరగతులు నిర్వహించడం, ఆటస్థలాలు లేకపోవడం, పాఠ్యపుస్తకాల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేయడం, అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన కొనసాగించడం వంటి అక్రమాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.