ప్రమాదవశాత్తు గాయపడి కర్నూలులోని శ్రీ చక్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పీకలపెట్ట గ్రామానికి చెందిన
వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షుడు మూకారెడ్డిని, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు చికిత్స ఖర్చుల కోసం ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, కాంతారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు.