పైరయ్య ఆంజనేయస్వామి ముఖద్వార నిర్మాణానికి విరాళం

1554చూసినవారు
పైరయ్య ఆంజనేయస్వామి ముఖద్వార నిర్మాణానికి విరాళం
పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలోని శ్రీ వ్యాసరాయ ప్రతిష్ఠిత శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం రాతిశిల ముఖద్వారం నిర్మాణానికి నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం కామినేనిపల్లె గ్రామానికి చెందిన మెరువ వెంకట్రామరెడ్డి, మెరువ సుమిత్ర కుటుంబ సభ్యులు రూ. 50,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి ఫలప్రసాదం, మంత్రాక్షతలతో ఆశీర్వదించగా, ఆలయ కమిటీ సభ్యుడు పరసాని అన్నమయ్య దాతలను సన్మానించారు.

సంబంధిత పోస్ట్