పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన ఎం. రమేష్ అనే యువకుడిని
వైసీపీ రైతు విభాగం తాలూకా అధ్యక్షుడు కేపీ యల్లప్ప ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు చెవుల లక్ష్మన్న, బోయ కడబూరి, రాముడు, మల్లయ్య, వీరేష్, తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. గ్రామానికి పేరు తీసుకువచ్చిన యువకుడు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.