మంత్రాలయం: తుంగభద్రలో మునిగి రెండు వృషభాల మృతి

1728చూసినవారు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దుల పారువేట కోసం సిద్ధం చేస్తుండగా తుంగభద్ర నదిలో రెండు వృషభాలు మునిగి మృతిచెందాయి. రాఘవేంద్ర నగర్‌కు చెందిన సురేష్‌కు చెందిన ఈ వృషభాల విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. విలువైన ఎద్దులు మృతి చెందడంతో యజమాని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్