ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

2291చూసినవారు
ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మంత్రాలయం మండలంలోని బసాపురం గ్రామంలో గురువారం నాడు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి నూతనంగా నిర్మించిన ఫిల్టర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా బసాపురం గ్రామ ప్రజలు స్వచ్ఛమైన నీటిని పొందనున్నారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భీమా రెడ్డి, కోసిగి ఇన్‌చార్జ్ మురళి రెడ్డి, మాజీ సర్పంచ్ రాఘవ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్