మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన రహదారిని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రహదారి నిర్మాణ వివరాలను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు నూతన రహదారి సౌకర్యవంతంగా ఉండనుందని తెలిపారు.