కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు ఎస్సీ కాలనీలో
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది.
టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి ఎన్. రమాకాంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరవ శశిరేఖ చేతుల మీదుగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తామని రమాకాంతరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక
టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.