పెద్దకడబూరు: దొరికిన బంగారం పోలీసులకు అప్పగించిన వికలాంగుడు

1901చూసినవారు
పెద్దకడబూరు: దొరికిన బంగారం పోలీసులకు అప్పగించిన వికలాంగుడు
పెద్దకడుబూరు ఎస్సీ కాలనీకి చెందిన వికలాంగుడు కుదె మారెప్ప మంగళవారం తన నిజాయితీని చాటుకున్నాడు. ఈనెల 29న బ్యాంకు పనిపై వెళ్తుండగా మార్గమధ్యంలో దొరికిన పర్సులో సుమారు రెండున్నర తులాల బంగారు నగలు, రూ. 1,300 నగదు ఉన్నట్లు గుర్తించి, వాటిని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అప్పగించాడు. పోలీసులు విచారణలో ఆ పర్సు పెద్దకడుబూరుకు చెందిన చాకలి మధుదిగా గుర్తించి, నగలు, నగదును ఆయనకు అందజేశారు. నిజాయితీ ప్రదర్శించిన మారెప్పను పోలీసులు అభినందించి సన్మానించారు.

సంబంధిత పోస్ట్