జిల్లా కలెక్టర్, డీఈవో, ఏపీసీ ఆదేశాల మేరకు పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబలం, చిన్నకడబూరు, గవిగట్టు గ్రామాలలో వలస కుటుంబాల పిల్లల కోసం శనివారం సీజనల్ హాస్టళ్లను ప్రారంభించారు. వలస కుటుంబాల పిల్లలు విద్యకు దూరం కాకుండా, డ్రాప్‌అవుట్‌లకు గురికాకుండా నిరంతరం చదువుకునేలా ఈ హాస్టళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు టిఫిన్, రాత్రి భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తూ ప్రతిరోజూ పాఠశాలకు హాజరై చదువును కొనసాగించాలని సూచించారు.