పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు గ్రామంలో గ్రామ సచివాలయం నందు రైతులకు మంత్రాలయం
టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి బుధవారం ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.
టీడీపీ నేతలు ఈరన్న, ఏసేపు, మల్లికార్జున, నరసప్ప, రామాంజనేయులు పాల్గొన్నారు.