గవిగట్టులో పింఛన్ల పంపిణీ చేసిన టీడీపీ ఇన్ చార్జ్

2586చూసినవారు
గవిగట్టులో పింఛన్ల పంపిణీ చేసిన టీడీపీ ఇన్ చార్జ్
పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో బుధవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన పింఛన్లు అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గవిగట్టు ఈరన్న, ఏసేబు, మల్లికార్జున, నరసప్పతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్