మంత్రాలయం మండలంలోని కంబదహాల్ గ్రామంలో బుధవారం
టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, మంత్రాలయం
టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వృద్ధులకు వరంలాంటిదని, ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని తెలిపారు.