రైతులకు సేవ చేయడమే సహకార బ్యాంకుల లక్ష్యం.. రమాకాంతరెడ్డి

2665చూసినవారు
రైతులకు సేవ చేయడమే సహకార బ్యాంకుల లక్ష్యం.. రమాకాంతరెడ్డి
పెద్దకడబూరులో జరిగిన సహకార సంవృద్ధి–సహకార వారోత్సవాల్లో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి బుధవారం పాల్గొన్నారు. సహకార సంఘాలు రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు. 3,222 మంది సభ్యులున్న సంఘం 921 మంది రైతులకు రూ. 14 కోట్ల రుణాలు అందజేసిందని పేర్కొన్నారు. అనంతరం మొక్కలు నాటి, జన ఔషధి పథకం కింద ఉచిత మందులను పంపిణీ చేశారు. కర్నూలు, మంత్రాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు అధికారులు, సొసైటీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతులకు సేవ చేయడమే సహకార బ్యాంకుల లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్