విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన విద్యాకమిటీ చైర్మన్

2472చూసినవారు
విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన విద్యాకమిటీ చైర్మన్
మంత్రాలయం మండలం పెద్దకడబూరులోని ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో గురువారం పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ హనుమంతు, ప్రధానోపాధ్యాయులు వీరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకుని పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్