మంత్రాలయం మండలం సౌలహళ్లి, కోసిగి మండలం చిన్న బొంపల్లి గ్రామాల్లో గురువారం వికసిత్
భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని
టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు.