పెద్దకడబూరు గ్రామంలో గురువారం వికసిత్
భారత్ జీ రామ్ జీ పథకం కింద ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని
టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి సూచించారు. ఎంపీడీవో ప్రభావతి దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు ఏసేపు, మల్లికార్జున, బొగ్గుల తిక్కన్న, మొట్రు రామాంజనేయులు, ఆశన్న, ఏపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.