వీపనగండ్ల ZPHS ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను గ్రామంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని క్యాంపెయిన్ మంగళవారం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా పది ఫలితాలలో మన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మౌలాలి, జిలానీ, శర్మ, రాజేశ్ పాల్గొన్నారు. నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో ఈ ప్రచారం జరిగింది.