నేరాల అరికట్టడంలో సీసీ కెమెరాలు: ఎస్సై మణికంఠ అవగాహన

743చూసినవారు
నేరాల అరికట్టడంలో సీసీ కెమెరాలు: ఎస్సై మణికంఠ అవగాహన
నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర, సైబర్ సెక్యూరిటీ, హెల్మెట్ వాడకం వంటి అంశాలపై ఎస్సై మణికంఠ గ్రామస్థులకు సోమవారం అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. హెల్మెట్ తలకు భారం కాదని, ప్రాణానికి భరోసా అని ఆయన పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్