ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేలా కేంద్రం చర్యలు: సీపీఎం

479చూసినవారు
ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేలా కేంద్రం చర్యలు: సీపీఎం
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పగిడ్యాల మండలం, కొత్త ముచ్చు మర్రి గ్రామంలో సీపీఎం పార్టీ మండల కన్వీనర్ పి. పక్కిరి సాహెబ్ శుక్రవారం ఉపాధి కూలీలతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేలా విజి రాoజీ పథకాన్ని తీసుకురావడం గ్రామీణ పేదలపై దాడి చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.