శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వం కోల్పోయిన 98 జీఓ నిర్వాసితులకు ప్రభుత్వం హామీని నెరవేర్చాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నందికొట్కూరులో దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం హామీని నెరవేర్చకపోవడం మోసం చేయడమేనన్నారు. జీఓ 98 ప్రకారం 980 మందికి మాత్రమే అవకాశం కల్పించారని, ఇంకా 674 మంది దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని, దాదాపు 46 వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.