నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ఎం. ఘణపురం, ఎన్. ఘణపురం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తోందని తెలిపారు. ప్రాతకోట గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ. 20 వేల చెక్కును లబ్ధిదారికి అందజేశారు.