డోన్: ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోట్ల

1526చూసినవారు
డోన్: ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోట్ల
డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్