డ్రైనేజీ కాలువలు తక్షణమే నిర్మాణం చేపట్టాలి:CPI.ML పార్టీ

3126చూసినవారు
డ్రైనేజీ కాలువలు తక్షణమే నిర్మాణం చేపట్టాలి:CPI.ML పార్టీ
నందికొట్కూరులో ప్రమాదాలకు నిలయంగా మారిన శాంతి థియేటర్ సమీపంలోని డ్రైనేజీ కాలువలను తక్షణమే నిర్మించాలని సీపీఐ (ఎంఎల్) పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం మునిసిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో జనాభా, వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో రహదారిని వెడల్పు చేసి, ప్రమాదాలను నివారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్