వీపనగండ్ల ZPHS ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు బుధవారం అవగాహన కల్పించి, 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన ఆహారం, మౌలిక వసతులు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల బోధన అందుబాటులో ఉన్నాయని, విలువలతో కూడిన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించాలని సూచించారు.