బ్రాహ్మణ కొట్టుకూర్ ఎస్సై మణికంఠ మాట్లాడుతూ, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ఈ-చలాన్స్, లైసెన్స్ వంటి సేవలతో పాటు పెండింగ్ లో ఉన్న చలాన్స్ ను కూడా ఇక్కడ చెల్లించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఆయన పిలుపునిచ్చారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.